*- అందరి అభిప్రాయాలు, సమిష్టి నిర్ణయాలతోనే తాండూర్ సమగ్ర అభివృద్ధి*
ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న జనావాస ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు కృషి
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూర్ మాస్టర్ ప్లాన్‌పై పట్టణ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం..
తాండూరు, అక్షిత ప్రతినిధి:
తాండూరు పట్టణ సమగ్ర అభి వృద్ధితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పట్టణంలోని ప్రముఖులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాండూర్ మాస్టర్ ప్లాన్, జోనింగ్ సమస్య లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
పట్టణంలోని పలు జనావాస ప్రాంతాలు సైతం ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో నమోదై ఉండ టంతో ఆయా కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమావేశంలో ప్రముఖులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ జోన్‌గా ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు తీసుకో వాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు తమ విలువైన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. జోనింగ్ సమస్య కారణంగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మున్సిపాలిటీ ద్వారా పొందాల్సిన కొన్ని మౌలిక సదుపాయాలు, నిర్మాణ అను మతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, తెలిపారు. గతంలో కూడా ఈ సమస్య పరిష్కా రానికి పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితం లభించలేదని, పేర్కొన్నారు. ప్రజల సమ స్యలను దృష్టిలో ఉంచుకుని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని, ఎమ్మెల్యేకు సూచించారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలతో పాటు వివిధ రంగాల ప్రము ఖుల అభిప్రాయాలను సేకరించడం మంచి పరిణామ మని, అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ పట్టణ అభివృద్ధి అనేది ఒక్కరి నిర్ణయంతో సాధ్యమయ్యేది కాదని, ప్రజలు, మేధావులు, నిపుణులు, ప్రజాప్రతి నిధులందరి సమిష్టి ఆలో చనలు, నిర్ణయాలతోనే సాధ్యమవుతుందని, తెలిపారు. జనావాస ప్రాంతాలు ఇండస్ట్రియల్ జోన్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టిలో ఉందని, ఈ సమస్యను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, తెలిపారు.
తాండూర్ భవిష్యత్ అభి వృద్ధిని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రముఖుల అభి ప్రాయాలు తెలుసుకోవడానికే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని, పేర్కొన్నారు. సమా వేశంలో పలువురు అందించిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవని, అందరి అభి ప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మని తెలిపారు. రెసిడెన్షియల్ జోన్ మార్పు ప్రక్రియపై మరిన్ని సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేక రిస్తామని, అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమా వేశంలో చర్చించి కౌన్సిల్ ఆమోదంతో తదుపరి చర్యలు చేపడతామని, స్పష్టం చేశారు. అందరి సహకారంతో తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసు కుందామని, పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బల్ రెడ్డి, మాజీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, విశ్వనాథ్ గౌడ్, కోట్రిక విజయలక్ష్మి, స్వప్న పరిమల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్తలు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.