విలేకరుల సంక్షేమమే లక్ష్యం
– టీయూడబ్ల్యూజే పెద్ద అడిశర్లపల్లి మండల అధ్యక్షుడిగా గణపురం శంకర్
పెద్ద అడిశర్లపల్లి, అక్టోబర్ 02 (అక్షిత ప్రతినిధి):
టీయూడబ్ల్యూజే పెద్ద అడిశర్లపల్లి మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్షుడిగా గణపురం శంకర్ ఎన్నికయ్యారు.గౌరవ అధ్యక్షుడిగా మద్దిమడుగు సదానందం, గౌరవ సలహాదారుగా బడుగుల కృష్ణ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా గుండాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా భాష్పాక రవి ఎంపికయ్యారు. సహాయ కార్యదర్శిగా బొడ్డుపల్లి కళాచారి, కోశాధికారిగా కోమండూరు శ్రీరమణ, ప్రచార కార్యదర్శిగా మాదర్ శంకర్ ఎన్నికయ్యారు.పలువురు జర్నలిస్టులు కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ విలేకరుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.విలేకరులకు గ్రూప్ ఇన్సూరెన్స్, ఇంటి స్థలాలు, ఇళ్ల కోసం కృషి చేస్తానని తెలిపారు.కమిటీ రిజిస్ట్రేషన్, బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి నిధులు సమకూర్చుకునేలా చర్య తీసుకుంటామన్నారు. విలేకరుల ఐక్యత, సంక్షేమం కోసం అందరి సహకారంతో ముందుకు సాగుతానని శంకర్ స్పష్టం చేశారు.నూతన కమిటీ సభ్యులకు జిల్లా, నియోజకవర్గ నాయకులు, జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.