పోలీస్ లు ప్పుడు కేసు, అప్పీల్ రెండూ కొట్టివేత… గాంధీ జయంతి రోజు 112 మొక్కలు పంపిణీ చేసిన మహెందర్

  పోలీస్ లు ప్పుడు కేసు, అప్పీల్ రెండూ కొట్టివేత… గాంధీ జయంతి రోజు 112 మొక్కలు పంపిణీ చేసిన మహెందర్

గంగాధర అక్షిత న్యూస్ 

గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామంలో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జంగిలి మహేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు 9 రకాల 112 మొక్కలను పంచడం తో పాటు స్వీట్లు పంపిణీ చేసి, అహింసపై స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. గాంధీ జయంతి రోజున ప్రేమ, శాంతి, అహింస సూత్రాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం జరిగింది వివరాల ప్రకారం… ​2017లో గంగాధర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన అప్పటి ఎస్సై స్వరూప్ రాజ్, స్టేషన్ ప్రైవేట్ డ్రైవర్ పొన్నాల శంకర్‌తో కలిసి కుట్రపూరితంగా కానిస్టేబుల్ సుందరగిరి శ్రీనివాస్ (పీసీ 2883) ద్వారా ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినట్లు తప్పుడు ఫిర్యాదు చేయించారు. మహేందర్ ను తన సోదరి వివాహ రిసెప్షన్‌కు పోనీయకుండా స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి తప్పుడు కేసు నమోదు చేశారు.​ఈ కేసు (సిసి967/2022) న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు చూపించకపోవడంతో ఆరోపణలు నిరూపితం కాక గతేడాది మే నెలలో మహేందర్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

​అప్పీల్‌నూ కొట్టివేసిన జిల్లా కోర్టు

మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రస్తుత గంగాధర ఎస్సై వంశీకృష్ణ తప్పుడు అంశాలతో కరీంనగర్ జిల్లా కోర్టులో క్రిమినల్ అప్పీల్ (సి ఆర్. ఏ 15/2025) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా న్యాయస్థానం సైతం పోలీసుల అప్పీల్‌ను కొట్టివేస్తూ ఇటీవల మహేందర్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన ఈ తప్పుడు కేసుల వల్ల తాను తీవ్ర ఆర్థిక నష్టాన్ని, సామాజిక అవమానాన్ని, కుటుంబపరమైన మానసిక వేదనను అనుభవించానని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా కేసు బనాయించిన పోలీసులపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు వేశానని, ప్రస్తుతం ఆ కేసు (సీసీ1118/2022) కరీంనగర్ కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. ఆ కేసులోనూ తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.నిరాధారమైన ఆరోపణలతో సామాన్యుడినైనా నాపై తప్పుడు కేసు బనాయించిన అప్పటి ఎస్సై స్వరూప్ రాజ్‌తో పాటు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ 112 నెలల పాటు జరిగిన అన్యాయానికి నిరసనగా ఎస్సై స్వరూప్ రాజు నమోదు చేసిన కేసులో ఎక్కడైతే నేరస్థలం సూచించారో అదే ప్రదేశం లో శాంతియుతంగా 112 మొక్కలను, స్వీట్లను పంపిణీ చేసారు. ప్రతి మొక్క ఒక నెల బాధను సూచిస్తూ, ప్రతి ఆకు నిరీక్షణను, ప్రతి వేరు న్యాయం కోసం పోరాటాన్ని గుర్తు చేస్తుందని మొక్కలు నిశ్శబ్దంగా జీవిస్తూ, పెరుగుతూ, నీడనిస్తూ, గాలిని శుభ్రం చేస్తాయని, అదే మన సందేశం కావాలని జంగిలి మహేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking