హైదరాబాద్ –విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ –విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

– రోడ్డు పనులు.. వరుస సెలవులతో పెరిగిన వాహనాల రద్దీ

– పలుచోట్ల కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

చౌటుప్పల్ అక్షిత ప్రతినిధి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు పనులతో పాటు వరుస సెలవులు రావడంతో హైవేపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. చౌటుప్పల్ నుంచి ఎల్లంబావి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర, దండుమల్కాపురం ప్రాంతంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ఎల్లగిరి నుంచి దండుమల్కాపురం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking