దేవుళ్లను వేరు చేసి మాట్లాడటం హిందూ ధర్మానికి ద్రోహమే
– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బిజెవైఎం జిల్లా ఐటి సెల్ ఇంచార్జి మచ్చ వివాకర్ రెడ్డి ఆగ్రహం
– హిందూ ధర్మం, సంస్కృతిని అవమానించవద్దని హితవు
– ఎన్నికల సమయంలో దేవుళ్లను పూజించిన విషయాన్ని గుర్తు చేసిన నేత
యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో
హిందూ ధర్మం, సంస్కృతి, దేవుళ్లను విదేశీయులు సైతం ఆరాధిస్తున్నారని, అలాంటి ధర్మంలో దేవుళ్లను వేరు చేసి మాట్లాడటం సరికాదని బి జె వై ఎం జిల్లా ఐ టి సెల్ ఇంచార్జి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం కోసం గతంలో వివిధ ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించిన సీఎం ఇప్పుడు హిందూ దేవుళ్లను వేరు చేసి మాట్లాడటం బాధాకరమన్నారు. చిన్నప్పటి నుంచి రాముడు, శివుడు, హనుమంతుడు, అమ్మ వారి ఆలయాలను దర్శించి, పుణ్యక్షేత్రాలకు వెళ్లిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకోవాలని సూచించారు. అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. హిందూ సమాజంలో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని అయన కోరారు.