రైతన్న పోరాటాలను తీవ్రతరం చేయండి
– ఏఐకేఎంఎస్ సంస్థను సంఘటిత పరిచి మరింత విస్తరింప చేయాలి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. గత జాతీయ మహాసభల నుంచి నేటి వరకు సంఘం నిర్వహించిన కార్యక్రమాలు చేపట్టిన పోరాటాలు సాధించిన విజయాలు ఎదురైన అనుభవాలను వివరిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ వివరమైన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. దానిలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం సాగించిన పోరాటాల్లో ఏఐకేఎంఎస్ చురుకైన పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సాగిన రైతాంగ ఉద్యమంలో -ఏఐకేఎంఎస్ విస్తృతంగా పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేసిందన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రైతాంగ ఉద్యమం సాధించిన విజయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఉద్యమం ద్వారా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో రైతాంగంతో ఏఐకేఎంఎస్సంబంధాలు విస్తృతమయ్యాయని సంస్థకు కొత్త ప్రాంతాల్లో పరిచయాలు ఏర్పడి ఉద్యమ విస్తరణకు మార్గం ఏర్పడిందని తెలిపారు. ఉద్యమ సందర్భంగా ఎదురైన అనుకూల, ప్రతికూల అనుభవాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకు వాటిని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
భూమి సమస్యపై నిరంతర పోరాటాల
దేశవ్యాప్తంగా భూమి సమస్యపై ఏఐకేఎంఎస్ నిర్వహించిన పోరాటాలను నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. బీహార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా తదితర రాష్ట్రాల్లో భూమిలేని పేదలు రైతులు కౌలు రైతులు దళితులు ఆదివాసీల భూమి సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు.బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రతిఘటిస్తూ అనేక రాష్ట్రాల్లో ప్రాంతాల్లో రైతాంగాన్ని భూమిపై ఆధారపడిన ప్రజలను సమీకరించి పోరాడినట్లు కొన్ని విజయాలు సాధించినట్లు ఇది కిలో పేర్కొన్నారు. భూస్వాములు భూకబ్జా ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియాలకు వ్యతిరేకంగా కూడా ఉత్తర ప్రదేశ్ పంజాబ్ ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పోరాటాలు సాగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పంజాబ్ లో దళితులకు భూమి సాధించేందుకు నిర్వహించిన పోరాటాలను పోలీసుల నిర్బంధాన్ని, వందలకొద్దీ మూడు నెలలు జైల్లో గడిపిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను బలహీనపరిచి, దాని స్థానంలో వీబీ గ్రామగ్ వంటి కొత్త విధానాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ -ఏఐకేఎంఎస్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు నిర్మించిందని డాక్టర్ సతీష్ మిట్టల్ తెలిపారు. గ్రామీణ పేదలకు ఉపాధి హామీ కూలీలకు పని దినాలు, వేతనాలు సామాజిక భద్రత వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
సంస్థాగత బలోపేతమే ముందున్న ప్రధాన కర్తవ్యం
గత కాలంలో జరిగిన పోరాటాల విజయాలను సమీక్షించుకోవడంతో పాటు, వాటి నుంచి సంస్థాగత నిర్మాణానికి అవసరమైన పాఠాలను నేర్చుకోవాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సూచించారు.ఈ సమావేశానికి అధ్యక్ష వర్గంగా వేములపల్లి వెంకటరామయ్య సుశాంత్ జై చలపతిరావు రవీందర్ సింగ్ తదితరులు వ్యవహరించారు.