పార్టీలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి కృషి

పార్టీలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి కృషి

ఆర్బీవోఎల్‌ సీఈవో, కాంగ్రెస్‌ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి.. 

తాండూరు అక్షిత ప్రతినిధి:

పార్టీలకు అతీతంగా తాండూరు ప్రాంత అభి వృద్ధికి తన వంతు కృషి చేస్తున్నామని, ఆర్బీవోఎల్‌ సీఈవో, తాండూరు కాంగ్రెస్‌ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇటీవల కొందరు వ్యక్తులు తనపై కక్షపూరితంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఇంతకాలం సహనంతో వ్యవహరిస్తూ, వారి విజ్ఞతకే వదిలేశానని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తన మంచితనాన్ని చేతకాని తనంగా భావించి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదన్నారు. ఇకపై తన పేరును ప్రస్తావిస్తూ, ఇష్టాను సారంగా మాట్లాడితే, తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా పేర్కొనడం, తనను ‘షాడో ఎమ్మెల్యే’గా అభివర్ణించడం, అక్రమ భూదందాలు, ఇసుక, ఎర్ర మట్టి వ్యాపారం చేస్తున్నా నంటూ, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భద్రేశ్వర దేవాలయం, పోట్ల మహారాజ్‌ దేవాలయ నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న వారు వాటిని నిరూపించాలని, సవాల్‌ చేశారు. తాను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపిస్తే, వారు కోరిన విధంగా చర్యలకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మైక్‌ చేతిలో ఉందని, ప్రజలు ముందు ఉన్నారని, ఇష్టానుసారంగా ఆరో పణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదన్నారు. ఇకపై మాటలతో కాకుండా చట్టపరమైన, తగిన విధంగా సమాధానం ఇస్తామని, పేర్కొన్నారు.

తాండూరుతో విడదీయరాని అనుబంధం.. 

తాండూరు ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తూ, ఇక్కడి ప్రజల సమస్యలు, అవసరాలను దగ్గరగా తెలుసుకున్నానని, శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పరిగి ప్రాంతం తనకు జన్మనిస్తే, తాండూరు ప్రాంతం తనకు జీవితాన్ని అందించిందని, భావో ద్వేగంగా పేర్కొన్నారు. తాండూరు తనకు ఎంతో ఇచ్చిన ప్రాంతమని, తన ప్రాణం ఉన్నంతవరకు ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, అన్నారు. ఆర్బీవోఎల్‌ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పి స్తున్నామని, తెలిపారు. తాండూరు నియోజక వర్గంలోని ప్రభుత్వ, పాఠశాలల అభివృద్ధికి ఫ్యాక్టరీ తరఫున ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. రక్షణ దళాలకు కూడా విరాళాలు అందించినట్లు గుర్తుచేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫ్యాక్టరీపై స్థానికంగా సుమారు 2,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.

అభివృద్ధిపై రాజకీయాలు వద్దు.. 

కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా రాజకీయాలు చేస్తూ, తమపై బురద జల్లడం అవివేకమని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల పాలనలో తాండూరు నియోజక వర్గంలో సుమారు రూ.2 వేల కోట్లతో 2,239 అభివృద్ధి పనులు చేపట్టి నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీ యాలకు అతీతంగా చూడాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, పదవులు కల్పిస్తున్నామని, అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని ఎప్పటికీ మరిచిపోమని, శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

అవకాశం వస్తే ఎన్నికల బరిలో..

భవిష్యత్‌లో పార్టీ అధి ష్ఠానం అవకాశం కల్పిస్తే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భగవంతుడి ఆశీర్వాదం, పార్టీ అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తాండూరు ప్రాంత ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, అభి వృద్ధి కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగు తుందని, ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking