యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు
చేర్యాల ఎస్ఐ జి.అపూర్వరెడ్డి
చేర్యాల, అక్షిత ప్రతినిధి: యువకులు మత్తు పదార్థాలకు బానిసలై మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని చేర్యాల ఎస్ఐ జి. అపూర్వ రెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్సై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని యువకులు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నతమైన చదువులు కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలి కానీ, మీ బంగారి భవిష్యత్తును నాశనం చేసుకోదని యువతకు పిలుపునిచ్చారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూపు వస్తాయని వాటి ద్వారా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఓటిపి, బ్యాంకు నెంబర్, పాస్వర్డ్, నంబర్లను ఎవరికి తెలుపవద్దని అన్నారు.