పర్యాటక దినోత్సవ పోటీల్లో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ
– జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి కైవసం
– విద్యార్థులకు అభినందనలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పర్యావరణ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన ఎస్. శరణ్ తేజ్, ఎల్. విశ్వ సాయి, ఎస్. శ్రీకారుణ్య, తస్లీం ఖానం, ఈ. శ్రీవిద్య తదితర విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులతో పాటు వారికి మార్గదర్శకత్వం వహించిన గైడ్ టీచర్ మురళిని కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ బి. సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణి అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.