పేదింటికి ఆహార భద్రత

పేదింటికి
ఆహార భద్రత

చారిత్రాత్మకం..
  సన్నబియ్యం

ప్రతిష్టాత్మకం
 స్మార్ట్ రేషన్ కార్డు

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక వినూత్న పథకం

సన్న బియ్యంతో
సంతృప్తి నిచ్చింది

గత ప్రభుత్వం ఒక్క
రేషన్ కార్డు ఇవ్వలే

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

పేదలకు కడుపునిండా అన్నం పెట్టే సన్న బియ్యం పథకం ఎంతో సంతృప్తినిచ్చిందని రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల పట్టణంలోని ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్ లో నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల చెందిన అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తమ ప్రభుత్వమని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పథకం లేదన్నారు.గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని వ్యక్తం చేశారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 16.32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు.

తెలంగాణలో మొత్తం కలిపి 1,06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, దీంతో 3,42,57,109 మంది ఆహార భద్రత లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం కలిపి 3,72,658 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం రేషన్ కార్డుల 1,08,011 ఉండగా ఈ రోజు కొత్తగా గరిడేపల్లి మండలంలో 20,258, పాలకీడు మండలంలో 9,095, నేరేడుచర్ల మండలంలో 14,035 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి అన్నారు. సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలకు కడుపునిండా భోజనం పెడుతున్నామని గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం కోళ్ల ఫారాలు, బీర్ల తయారీ,రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడానికి ఉపయోగపడ్డాయని తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నామని రాష్ట్రంలో 85 శాతం మంది జనాభాకు కడుపునిండా అన్నం పెట్టే పథకం పెట్టడం చాలా సంతృప్తి నిచ్చిందని అన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ సన్న బియ్యం పథకం హుజూర్ నగర్ లోను,కొత్త రేషన్ కార్డులను తిరుమలగిరి నుండి ప్రారంభించు కోవడం చాలా సంతోషకరమైన విషయమని, అర్హులై ఉండి ఎవరికైనా కార్డు రానివారికి దరఖాస్తు చేసుకున్నచో కొత్త రేషన్ కార్డులు ఇప్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అగ్రికల్చర్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న,జిల్లా ఎస్పీ కే.నరసింహ,హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి,వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి తహసిల్దార్ సైదులు, వాజిద్, స్రవంతి,మున్సిపల్ కమిషనర్ నాగరాజు,ప్రజా ప్రతినిధులు,వివిధ గ్రామాల సర్పంచులు,అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking