విద్యే మనిషికి బలమైన ఆయుధం

విద్యే మనిషికి
బలమైన ఆయుధం

ఉల్లాస్ పరీక్ష రాస్తున్న
స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాడు ఉల్లాస్ పరీక్ష రాస్తున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల సోదరీమణులకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. విద్యకు వయసుతో సంబంధం లేదు.. విద్యే మనిషికి బలమైన ఆయుధం అని మంత్రి పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి లేకపోవడం, చిన్న వయసులో వివాహం వంటి కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన మహిళలు ఎంతోమంది ఉన్నారని తెలిపారు.

బడి మానేయడం అంటే చదువు ముగిసిపోయినట్లు కాదని, ఆగిపోయిన చదువును ఎప్పుడైనా తిరిగి కొనసాగించవచ్చని అన్నారు. ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి నేరుగా పదో తరగతి పరీక్ష రాసే అవకాశం లభిస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లో చదువు మధ్యలో ఆపేసిన మహిళలను గుర్తించి, తిరిగి విద్యను కొనసాగించేలా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా సెర్ప్ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలను కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, సామాజిక సాధికారతలోనూ ముందుకు తీసుకెళ్లడమే ఇందిరా మహిళా శక్తి లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking