ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా కృష్ణవేణి
చేర్యాల, అక్షిత ప్రతినిధి: అంగన్వాడి విధి నిర్వహణలో భాగంగా విశిష్ట సేవలందించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన చేర్యాల పట్టణ11వ అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన తాటిపాముల కృష్ణవేణి టీచర్, శనివారం సిద్దిపేట జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగినిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో కృష్ణవేణి కి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణవేణిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి ఎస్.రష్మీ పేరు మాల్, తదితర అధికారులు ఉన్నారు.