చేర్యాల నకాశీ చిత్రకళకు గవర్నర్ ప్రశంసలు
చేర్యాల అక్షిత ప్రతినిధి :
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన చేర్యాల నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసించారు.శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జానపద కళా సంప్రదాయానికి చెందిన నకాశీ మాస్క్‌లు శనివారం లోక్‌భవన్‌లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ ఎట్ హోమ్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన నకాశీ మాస్క్‌లను గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, గవర్నర్ సతీమణి జానకి శుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు. నకాశీ కళలోని కళాత్మకత, ప్రత్యేకతలకు గవర్నర్ ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నకాశీ కళాకారుడు దనాలకోట రాకేశ్‌ను గవర్నర్ అభినందించారు. అనంతరం
నకాశీ కళలోని ప్రత్యేకతలు, మాస్క్‌ల తయారీ విధానం, తన తండ్రి ప్రముఖ నాకాసి కళాకారుడు దానాల కోట వైకుంఠం ద్వారా ఈ కళను నేర్చుకున్నానని, వాటి వెనుక ఉన్న కళా సంప్రదాయాల గురించి దానాలకోట రాకేశ్ గవర్నర్ దంపతులకు వివరించారు. అనంతరం
చేర్యాల నకాశీ చిత్రకళ తెలంగాణ జానపద కళా సంపదలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశీకిరణాచారి తదితరులు పాల్గొన్నారు.