లక్ష్మిపల్లి గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లక్ష్మిపల్లి గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం: గ్రామ సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ

దేశభక్తి-ఐక్యత-సమగ్రత మనందరి బాధ్యత

ఉమ్మడి మండలం మాజీ జడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్

చిన్నంబావి, అక్షిత న్యూస్ :

చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇటిక్యాల పెంటమ్మ స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ… భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను, దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు తదితర మహనీయులు చేసిన పోరాటాలను, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఎన్నో సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాది మంది వీరులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడంతో పాటు, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ సభ్యులు కృష్ణప్రసాద్ యాదవ్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking