బీజేవైఎం ఐటీ సెల్ ఇంచార్జి గా మచ్చ వివాకర్ రెడ్డి

బీజేవైఎం ఐటీ సెల్ ఇంచార్జి గా మచ్చ వివాకర్ రెడ్డి

– నూనెగూడం గ్రామానికి చెందిన మచ్చ వివాకర్ రెడ్డిని బీజేవైఎం ఐటీ సెల్‌ ఇంచార్జి నియమిస్తూ పార్టీ బాధ్యతలు అప్పగింపు

యాదాద్రి భువనగిరి అక్షిత ప్రతినిధి 

బీజేవైఎం ఐటీ సెల్ ఇంచార్జి గా యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం నూనెగూడం గ్రామానికి చెందిన మచ్చ వివాకర్ రెడ్డిని బాధ్యతలకు నియమించారు. యువతను పార్టీ కార్యక్రమాలతో అనుసంధానం చేయడంతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐటీ సెల్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మచ్చ వివాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. యువతను చైతన్యవంతం చేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking