నూతన మహిళా సమాఖ్య భవన శంకుస్థాపన

నూతన మహిళా సమాఖ్య భవన శంకుస్థాప 

చిలుకూరు ఆగస్టు 15 (అక్షిత న్యూస్):

మండల పరిధిలోని ఆచార్యులగూడెంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి లక్ష్మి బిక్షం చేతుల మీదుగా పది లక్షల రూపాయల మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సర్పంచి లక్ష్మీ బిక్షం మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి నలమదా ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో పది లక్షల రూపాయల మహిళా సమాఖ్య భవనం తీసుకురావడం జరిగిందని,ఇలాగే ఎమ్మెల్యే సహాయ సహకారాలు ఎప్పుడు మన ఊరికి ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నెమ్మాది వీరబాబు,కార్యదర్శి రాముడు, వార్డు సభ్యులు అలవాల భాస్కర్, లక్ష్మారెడ్డి, నాగలక్ష్మి, రత్నకుమారి, ధనలక్ష్మి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైలారిశెట్టి రాంబాబు, మాజీ సర్పంచ్ వినోద వీరారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నర్సిరెడ్డి గ్రామ పెద్దలు మైలారిశెట్టి వెంకయ్య, ముసి శ్రీనివాస్, మైలారిశెట్టి చిన్న ఎలమందయ్య, దుస్సా రామ నరసయ్య, సంఘ బంధం అధ్యక్షురాలు నాగమణి, వన సేవకురాలు అనిత, నాగన్న, సోమయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు

Leave A Reply

Your email address will not be published.

Breaking