మహిళ అదృశ్యం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఈ నెల 16న కూలి పనులకోసమని మిర్యాలగూడకు వచ్చిన మహిళ అదృశ్యమైనట్లు మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు పేర్కొన్నారు. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి సాగర్ మండలం మెగ్యతండాకు చెందిన పానుగోతు అఖిల (28) 16వ తేదిన కూలీ పనులకోసమని మిర్యాలగూడ కి వచ్చింది. 28ఏండ్ల వయసు ఉన్న మహిళకి భర్త రమేష్, 3 సంవత్సరాల బాబు, 16నెలల వయసు కలిగిన కుమార్తె ఉన్నారు. మహిళ ఆచూకీ తెలిసినవారు
94407 31986, 81868 65497 సెల్ నెంబర్ల కు సమాచారం ఇవ్వవలసిందిగా ఎస్సై కోరారు.