శివ కుటుంబానికి బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆర్థిక చేయూత

శివ కుటుంబానికి బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆర్థిక చేయూత

రామన్నపేట అక్షిత ప్రతినిధి

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ముత్యాల శివ మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి శివ కుటుంబానికి అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా రూ.16,300 ఆర్థిక సహాయాన్ని శివ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. శివ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆపద సమయంలో మానవత్వంతో స్పందించి ఆర్థిక సహాయం అందించిన బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం సభ్యులను స్థానికులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking