శివ కుటుంబానికి గల్లీ బాయ్స్ యూత్ ఆర్థిక సహాయం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ముత్యాల శివ మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి, మృతుడి కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ.9,600 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. శివ కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన గల్లీ బాయ్స్ యూత్‌ను స్థానికులు అభినందించారు.