కరీంనగర్ పాల డైరీ భూములు రైతులకు ఉపయోగపడాలంటూ కధం తొక్కిన పాడి రైతులు

కరీంనగర్ పాల డైరీ భూములు రైతులకు ఉపయోగపడాలంటూ కధం తొక్కిన పాడి రైతులు

రైతుల ప్రయోజనాలకు వినియోగించాలి 

డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు

కరీంనగర్ అక్షిత బ్యూరో

కరీంనగర్ డైరీకి సంబంధించిన భూముల విషయంలో ధరణి రికార్డుల్లో ఉన్న పేరును భూ భారతి రికార్డుల్లో తెలంగాణ ఫెడరేషన్ పేరుపై మార్చడంపై కరీంనగర్ డైరీ పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింధి.ఈ విషయంపై కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ కరీంనగర్ డైరీకి సంబంధించిన భూములు డైరీ అభివృద్ధికి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా చూడాలని కోరారు. ధరణి రికార్డుల్లో కరీంనగర్ డైరీ పేరుతో ఉన్న భూములను భూ భారతి రికార్డుల్లో తెలంగాణ ఫెడరేషన్ పేరుపై మార్చడం వల్ల పాల ఉత్పత్తిదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. కరీంనగర్ డైరీకి సంబంధించిన భూములపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి, వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అలాగే పాల ఉత్పత్తిదారులకు పెండింగ్‌లో ఉన్న రూ.4 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రతి పాల ఉత్పత్తిదారుడికి 50 శాతం సబ్సిడీపై 2 పశువులను ప్రభుత్వం అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ పాలకవర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking