ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు, అక్షిత ప్రతినిధి :
రంజాన్ మాసం సందర్భంగా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలోని మదీనా మసీదులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోరె మియా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శివానందం, ఉప సర్పంచ్ శ్రీశైలం, భానూర్ ఉప సర్పంచ్ ఇక్బాల్, విక్రమ్ గౌడ్, స్వామి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కుమ్మరి శ్రీను, ఏరోళ్ల శ్రీను, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.