ఇంట్లో హోం కేర్ సర్వీస్ పనిచేయడానికి వొచ్చి దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన కూకట్ పల్లి పోలీసులు.. నిందితుడి నుంచి సుమారు 7 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం

ఇంట్లో హోం కేర్ సర్వీస్ పనిచేయడానికి వొచ్చి దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన కూకట్ పల్లి పోలీసులు..

నిందితుడి నుంచి సుమారు 7 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

ఇంట్లో కేర్ టెకర్ గా పని చేయడానికి వచ్చి వారి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన బంటి చంటి కుమార్ అనే వ్యక్తినీ కూకట్ పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు ప్రకారం
వివేకానంద నగర్ కాలనీలో నివసించే కొత్తకోట శైలజ అనే మహిళ తన భర్త ఆరోగ్యం బాగలేకపోవడంతో అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా కేర్ టెకర్ గా చంటి కుమార్ ని నియమించుకుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శైలజ యోగ క్లాస్ కు వెళ్లడాని గమనించిన నిందితుడు ఈ నెల 7వ తేదీన ఇంట్లోకి వెళ్లి దొంగతనానికి పాల్పడినాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుండి సుమారు 7 లక్షల రూపాయల విలువచేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడి పైన రాచకొండ కమిషనరేట్ పరిధిలో 29 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.
నిందితుడి పైన పీడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని ఏసీపీ చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి సిఐ నర్సింగ్ రావు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking