నిరీక్షణ వీడండి… ఆర్టీసీ యాప్ ను ఉపయోగించండి.

నిరీక్షణ వీడండి… ఆర్టీసీ యాప్ ను ఉపయోగించండి.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
తాము వెళ్లే గమ్యస్థానాలకు సంబంధించి ప్రయాణికులు బుక్ చేసుకున్న బస్సు ఏ బస్ స్టాప్ లో ఉంది అని తెలుసుకునే విధంగా టీఎస్​ఆర్టీసీ బస్సు ట్రాకింగ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని కూకట్ పల్లి డిపో మేనేజర్ ఇసాక్ తెలిపారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ యాప్ ద్వారా ప్రయాణికులు బస్టాప్‌లు, బస్‌స్టేషన్‌లలో నిరీక్షించడాన్ని నివారించవచ్చని అన్నారు.ఆర్టీసీ నుంచి మహిళా హెల్ప్‌లైన్, బస్సుల బ్రేక్‌డౌన్‌లతో పాటు..ప్రమాదాలు వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవ‌డానికి ఈ యాప్ ఉపయోగపడనుందనీ అన్నారు. ఆర్టీసీ ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్ ప్రవర్తన, బస్సు పరిస్థితి , డ్రైవింగ్‌పై అభిప్రాయాన్ని అందించ‌వ‌చ్చని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov.in లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking