దళిత రత్న పురస్కారాన్ని అందుకున్న బాలానగర్ ప్రాంతానికి చెందిన సుంకే దీప్తి.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
ప్రపంచ మేధావి, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ఇచ్చే అవార్డులు శుక్రవారం రవీంద్ర భారతి,హైదరాబాద్ లో దళిత రత్న పురస్కారాన్ని బాలానగర్ ప్రాంతానికి చెందిన సుంకే దీప్తిని ఎంపిక చేయడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్. డైరెక్టర్ భారతి మేడం మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ జంగా శ్రీనివాస్ , తెలంగాణ స్టేట్ మాల మహానాడు ఫౌండర్ ప్రెసిడెంట్ కె. గిరెందర్ మాల, దుబ్బాక నవీన్ మాల తెలంగాణ స్టేట్ మాల మహానాడు స్టేట్ జనరల్ సెక్రటరీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. నా సామజిక సేవలను గుర్తించి నాకు పురస్కారాన్ని ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.