రెవిన్యూ శాఖలో 40 ఏళ్ళు సేవలందించిన గీర్ధావర్ అల్లం రవి నేడు పదవి విరమణ
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరానికి చెందిన అల్లం రవి కుమార్ చైన్ మాన్ గా రెవిన్యూ శాఖలో ఉద్యోగం సాధించి గీర్ధావర్ గా వివిధ ప్రాంతాలలో పనిచేసి నేలకొండపల్లి గీర్ధావర్ గా రెండేళ్లు విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి నిన్న పదవి విరమణ పొందారు. నేలకొండపల్లిలో రెండు సంవత్సరాల పాటు పనిచేసి సౌమ్యుడిగా నిబద్ధత కలిగిన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవలను కొనియాడుతూ బుధవారం నేలకొండపల్లి రైతు వేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.