రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి హనుమాన్ యూత్ ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి హనుమాన్ యూత్ ఆర్థిక సహాయం

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నబోయిన కృష్ణయ్య కుటుంబానికి అండగా నిలిచేందుకు హనుమాన్ యూత్ (రిజిస్ట్రేషన్ నెం: 160/2013) సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, మొత్తం ₹21,200 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ యూత్ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా గ్రామ ప్రజలు, యువజన సంఘాలు, దాతలు అందరూ కలిసి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, మానవత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని, భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజలకు అండగా ఉంటామని హనుమాన్ యూత్ సభ్యులు తెలిపారు. “మన గ్రామం… మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహాయాన్ని అందించాలని హనుమాన్ యూత్ పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు ఏబూసి రమేష్ కోయగూర బాలకృష్ణ, ఆవుల సాయి కుమార్, నేర్లకంటి శివ శంకర్, మద్యల చందు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking