మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్
డాక్టర్ కొండ మల్లేశం గౌడ్
వృద్ధుడికి అండగా నిలిచి ఆశ్రయ కేంద్రానికి తరలించిన పోలీసులు.
చౌటుప్పల్ అక్షిత ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ వద్ద గత నాలుగు రోజులుగా అనాథలా తిరుగుతున్న వృద్ధుడు సుబ్రహ్మణ్యంను గుర్తించిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ మానవత్వంతో స్పందించారు.వృద్ధుడిని కలిసి తన వంతుగా రూ.500 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వెంటనే చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మధరావుకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని సురక్షితంగా చౌటుప్పల్ “అమ్మ నాన్న” ఆశ్రయ కేంద్రానికి తరలించారు.అనంతరం వృద్ధుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారిని గుర్తించి సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని పెట్రోలింగ్ సిబ్బందికి సూచించినట్లు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ తెలిపారు

