రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి BRS పార్టీ అండ
రూ.15,500 ఆర్థిక సాయం BRS పార్టీ గ్రామ నాయకులు
రామన్నపేట అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలో ఇటీవల జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కన్నెబోయిన కిష్టయ్య గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు BRS పార్టీ తరపున రూ.15,500ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇది చిన్న సహాయమే అయినప్పటికీ, బాధిత కుటుంబానికి కొంత ధైర్యం, భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.కన్నెబోయిన కిష్టయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే, గ్రామ ప్రజలందరూ బాధిత కుటుంబానికి అండగా నిలిచి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షులు ఆవుల భగవంతం,చిప్పలపల్లి రవీందర్,సీనియర్ నాయకులు ఆవుల నరేందర్, పార్టీ 7వ వార్డు మెంబర్ చినపాక రమేష్, BRSV నియోజకవర్గ అధ్యక్షులు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు మెంబర్ ఆవుల లక్ష్మి నారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి. ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.