తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ‘చలో భూదాన్’ కార్యక్రమానికి వెళ్లకుండా రామన్నపేట మండలంలోని పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు గురువారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను పోలీసులు వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్, మండల అధ్యక్షుడు నోముల శంకర్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఇమామ్ తదితరులు ఉన్నారు.