జీవితంపై విరక్తితో వృద్ధురాలి ఆత్మహత్య

జీవితంపై విరక్తితో వృద్ధురాలి ఆత్మహత్య

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో ఓ వృద్ధురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భగత్‌సింగ్ నగర్‌కు చెందిన సయ్యద్ బాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన తల్లి శారీఫబి (71) గత కొంతకాలంగా మానసిక ఆందోళనతో బాధపడుతోందన్నారు..బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రించిన అనంతరం, గురువారం తెల్లవారుజామున ఇంట్లోని గదిలో ఇనుప పైపుకు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking