కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన తిమ్మాపూర్ బీజేపీ నేతలు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన తిమ్మాపూర్ బీజేపీ నేతలు.

మానకొండూర్ అక్షిత న్యూస్

తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ మహాత్మానగర్ లోని మహిళా శిశు వికాస కేంద్రంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. లోగోడ సి ఎస్ ఆర్ నిధులతో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను అందించిన సందర్భంగా మహిళా వికాస కేంద్రం యంత్రాంగం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన ఉచిత కుట్టు మిషన్లను శుక్రవారం మహిళ లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా తిమ్మాపూర్ మండల బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, బూట్ల శ్రీనివాస్, మవురుపు సంపత్, కొయ్యడ శ్రీనివాస్, ఎర్రోజు లక్ష్మణాచారి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఓదెలు, దురిశెట్టి రమేష్, సుగుణాకర్, భూమ్ రెడ్డి, బీజేవైఎం నాయకులు దురిశెట్టి అజయ్, ప్రేమ్ చంద్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking