భారత కమ్యూనిస్ట్ పార్టీ మునుగోడు నియోజకవర్గ పాదయాత్ర ను జయప్రదం చేయండి – కరపత్రం ఆవిష్కరణ

భారత కమ్యూనిస్ట్ పార్టీ మునుగోడు నియోజకవర్గ

పాదయాత్ర ను జయప్రదం చేయండి

– కరపత్రం ఆవిష్కరణ

నాంపల్లి, అక్షిత న్యూస్:

నాంపల్లి మండలం సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సమావేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు కోరే సత్తయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామ్రేడ్ ఆర్ అంజయ్య చారి హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో సిపిఐ పాదయాత్ర ఎప్రిల్ 20 నుండి మే 05 వరకు జరిగే పాదయాత్ర జయప్రదం చేయాలని ఏప్రిల్ 20వ తారీఖున చౌటుప్పల్ కి పాదయాత్ర ప్రారంభానికి నాంపల్లి మండలం నుండి 30 బైక్ లతో కార్యకర్తలు వెళ్లాలని పిలుపునిచ్చారు రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరవీరుల త్యాగాల వారసులుగా నేటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘన చరిత్ర సిపిఐ పార్టీ. అందులో విప్లవాల ఖిల్లా అయినా నల్లగొండ జిల్లా ప్రజల పోరాట పటిమ చరిత్ర ప్రజలందరికీ బాగా తెలుసు. హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుపరచని బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలి కృష్ణ నదిలో వాటా దక్కకపోవడంతోనే దక్షిణ తెలంగాణ ముఖ్యంగా నల్లగొండ జిల్లా కరువుకాటకాలకు గురవుతూ ఫ్లోరోసిస్ బాధిత జిల్లాగా మారింది, సాగు త్రాగు నీరు ఇస్తే తప్ప ప్రజల ఆత్మగౌరవంతో బతకడం సాధ్యం కాదని ఈ జిల్లా ప్రజలు 1980 నుండి సుదీర్ఘకాలంగా ఉద్యమించిన ఫలితంగా చేపట్టిన ఎస్ ఎల్ బి సి సొరంగ పథకం ,ఏ ఎం ఆర్ ఎత్తిపోతల పథకం , డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టినప్పటికీ నికర జలాలు లేకపోవటంతో అదనపు జలాలపై డిండి లిఫ్టులో భాగంగా చేపట్టిన సింగరాజుపల్లి, గొట్టుముక్కల, చింతపల్లి, కిష్టరాయి పెళ్లి, చర్లగూడెం, శివన్న గూడెం, చేపట్టిన బ్యాలెన్స్ రిజర్వాయర్లు పిలాయి పెళ్లి, ధర్మ రెడ్డి, కాలువలను వెంటనే పూర్తి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించుటకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కేటాయించాలి, వ్యవసాయ రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని., అర్హులైన పెన్షన్ దారులకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, పెన్షన్లు ఇవ్వాలి, ధరణి పోర్టల్ అవుక తవుకలను సవరించి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, అర్హులైన పేదలందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి ఊరు పక్క వెంకటయ్య, తెలంగాణ ప్రజానాట్యమన జిల్లా అధ్యక్షులు జనం పాట జగన్, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు గిరి స్వామి, దండిగా వెంకటయ్య నేరెళ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking