బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తధ్యం.రంజీత్ రెడ్డి. *కార్యకర్తలకు నూతన ఉత్తేజం నింపేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు.
బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తధ్యం.రంజీత్ రెడ్డి.
*కార్యకర్తలకు నూతన ఉత్తేజం నింపేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు.
రాజేంద్రనగర్ అక్షిత ప్రతినిధి:
మణికొండ మున్సిపల్లోని,సుందర్ గార్డెన్స్ లో శనివారం నిర్వహచిన ఆత్మీయ సమేళనం ఘనంగా జరిగింది ఈకార్యక్రమాన్ని చేవెళ్ల ఎంపీ. డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పి. మహేందర్ రెడ్డి గారితో కలసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ …. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి కెసిఆర్ ప్రభుత్వాన్ని హ్యాట్రిక్ విజయం అందిస్తుందని ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలతో పార్టీ నేతల్లో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం ఉట్టిపడుతుందన్నారు. ఎన్నికలు కాస్త దూరంలో ఉన్నప్పటికీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణతో అధికార పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఎంతో మనోధైర్యం కనిపిస్తుందని ఆయన అన్నారు. వారి ఉత్సాహంతో ముచ్చటకు మూడోసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు కావడం లేదని ఈ పథకాలు దేశానికే ఆదర్శవంతమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు పార్టీ నేతల్లో చైతన్యం ఉత్సాహాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపడుతుందని వీటికి ప్రజల నుంచి ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి సత్ఫలితాలను అందిస్తుందని ఆయన అన్నారు. మరోసారి కెసిఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి నేత కార్యకర్త పార్టీ కోసం యుద్ధ సన్నద్ధులై పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం లో
మణికొండ మున్సిపల్ జరిగినా అభివృద్ధి పనులకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ లో జరిగినా, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వివరించారు.
పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేయడం క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను పార్టీ అధినేత సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశమన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ ప్లోర్ లీడర్ కె.రామకృష్ణ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షుడు శ్రీరాములు,మహిళ విభాగం అధ్యక్షురాలు పట్లోళ్ల రూపరెడ్డి,స్వర్ణలత గౌడ్,అందే లక్ష్మన్ రావు, కౌన్సిలర్లు,మాజీ ఎంపిపి తలారి మల్లేష్,సంధ్య, శ్రీనివాస్ రావు.మహిళ కార్యకర్తలు.పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు