ముందు నేనే కడతా… తర్వాత ప్రజలను అడుగుతా..!
తెలంగాణకు ఆదర్శమంటూ ప్రశంసలు.
ఆచరణే ఆదర్శం.. రూ.11,251 పన్ను స్వయంగా చెల్లించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్.
రామన్నపేట అక్షిత ప్రతినిధి
పన్నులు కట్టాలని ప్రజలకు చెప్పే ముందు.. తానే ముందుగా ఆచరించి చూపించారు ఎల్లంకి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన ఆయన తన ఇంటికి సంబంధించిన రూ.11,251 ఇంటి పన్నును స్వయంగా చెల్లించి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలంటే ముందుగా ప్రజాప్రతినిధులే బాధ్యతగా తమ పన్నులు చెల్లించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్యపై గ్రామస్తులు, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ, “తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయం ఇది” అని అభిప్రాయపడుతున్నారు.