మానసిక ఒత్తిడితో వివాహిత ఆత్మహత్య
మన్మథ్‌లో విషాద ఘటన.. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
లోకేశ్వరం, ఆగస్టు 12 (అక్షిత న్యూస్):
మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మథ్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాందిరి లక్ష్మి పెద్ద కుమార్తె గౌతమి (22)కి అదే గ్రామానికి చెందిన బరిడె సాయినాథ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మంగళవారం ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. బుధవారం ఉదయం అత్తగారింటికి వెళ్లిన గౌతమి మధ్యాహ్నం గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అత్త గంగమ్మ ఆమె తల్లికి సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న తల్లి కిటికీలోంచి చూడగా గౌతమి అపస్మారక స్థితిలో కనిపించింది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి బయటకు తీసుకొచ్చినా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.తన కుమార్తె కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఆమె మృతిపై భర్త, అత్తవారిపై ఎలాంటి అనుమానం లేదని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లోకేశ్వరం ఎస్సై ఎల్.ప్రదీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు తెలిపార.