ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

– పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి నివాళులు.. 

– ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను రామన్నపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను, ఆయన ఆశయాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాపూజీ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుదర్శన్, అధ్యక్షులు ఈడెం శ్రీనివాసరాధా, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు రచ్చ యాదగిరి, కార్యదర్శి నాగభూషణం, పున్న వెంకటేశం, వనం చంద్రశేఖర్, మండల చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు పెండం వేణు, వరం సుధాకర్, వనం కిష్టయ్య, జిల్లా దత్తాత్ది, దొంత నాగరాజు, సూర్యపెళ్లి చంద్రమోహన్, గంజి అశోక్, వనం విటల్, రచ్చ దయాకర్, గంజి చంద్రయ్య, పాండు, భవనాఋషి, బోడ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking