రామన్నపేటలో ఆగిపోయిన రైళ్లను పునరుద్ధరించాలి

రామన్నపేటలో ఆగిపోయిన రైళ్లను పునరుద్ధరించాలి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రామన్నపేట బీజేపీ నాయకులు

రామన్నపేట, అక్షిత ప్రతినిధి:

రామన్నపేటలో గతంలో నిలిపివేసిన నారాయణాద్రి, ఫలక్‌నుమా, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ రామన్నపేట బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రామన్నపేట మీదుగా నడిచే రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన రైళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి, రైళ్ల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, సికింద్రాబాద్ ఇన్‌చార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ గౌడ్, రామన్నపేట మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking