బహుముఖ ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

బహుముఖ ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలి

__గోట్టిపాముల బాబూరావు

___పోతంశెట్టి వెంకటేశ్వర్లు

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో

స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి అధ్యక్షులు గొట్టిపాముల బాబూరావు, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకుని భువనగిరి అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ 15 ఏటనే గాంధీజీ ఉపన్యాసాలకు ఆకర్షితుడై, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న గొప్ప నాయకుడని అన్నారు. ఆగష్టు 15, 1947 దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, నిజాం నవాబుల, భూ స్వాముల, పెత్తందార్ల, దొరల చేతుల్లో బందీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీనీ మనమంతా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఆ తర్వాత ఆంద్ర వలసవాదుల పెత్తందారీ వ్యవస్థను, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 నుండి 2012 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధుడని వారన్నారు . బాపూజీ తొంబై సంవత్సరాల వయస్సు లో కూడా డిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్షలు చేసిన లక్ష్మణ్ బాపూజీనీ మరువరాదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కి భువనగిరి ప్రాంతానికి విడదీయరాని బంధం ఉందని, జిల్లా కేంద్రంలోని భువనగిరి లో “ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు” ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి కొడారి వెంకటేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే “ఎయిర్ పోర్ట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును” పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి నాయకులు కొడారి వెంకటేష్, కొత్త బాలరాజు, సుర్వి శ్రీనివాస్, మాటూరి అశోక్, షేక్ హమీద్ పాషా, పూస శ్రీనివాస్, భువనగిరి శ్రీనివాస్ నేత, జి. విఠల్ స్వామి,చెన్నోజు నరేంద్రా చారి, బర్రె నరేష్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking