ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగ
– చేనేత కార్మికులు, పద్మశాలీల ఆధ్వర్యంలో నివాళులు
– నిరుపేద వితంతు మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను రామన్నపేట మండల వ్యాప్తంగా చేనేత వృత్తిదారులు, కార్మికులు, పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వెల్లంకి గ్రామంలో గ్రామ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక సేవలు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం సాగించిన కృషిని స్మరించుకున్నారు. నిరుపేద వితంతు మహిళలకు ఆర్థిక సాయం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గట్టుప్పల గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అప్పం లక్ష్మయ్య, ఆయన మనవరాలు నిహారిక పుట్టినరోజు సందర్భంగా నిరుపేద వితంతు మహిళలు మిర్యాల అంజలి, ఈపూరి సునితలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ కార్యనిర్వాహకులు కొంగరి జానయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు మిర్యాల ఉపేందర్ చేతుల మీదుగా ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వనం పురుషోత్తం, రుద్ర వెంకటేశం, శంభు లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గంజి నరసింహ, వనం సత్తయ్య, గంజి లక్ష్మయ్య, వనం నర్సింహ, వనం వెంకటేశం, రావేటి రమేశ్, రావేటి సతీష్, కొంగరి నిరంజన్, మిర్యాల సత్తయ్య, చిక్క బాబూరావు, గజం భాస్కర్, వనం స్వామి తదితరులు పాల్గొన్నారు.