జాతీయస్థాయి కరాటేలో ఆల్ఫోర్స్ విద్యార్థుల సత్తా
13 పతకాలు కైవసం..
3 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు
విజేతలకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా. వి. నరేందర్‌రెడ్డి అభినందనలు
లోకేశ్వరం అక్షిత ప్రతినిధి
హైదరాబాద్ చంపాపేట్‌లోని మండా బాల్‌రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఆగస్టు 9న నిర్వహించిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో భైంసా ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి మొత్తం 13 పతకాలు సాధించి తమ సత్తా చాటారు. ఇందులో 3 బంగారు, 5 రజత, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. అండర్-10 కాటా విభాగంలో జాదవ్ విశాంత్, ముఫ్లెహా కొయినైన్, అండర్-10 కుమిటే (-26 కిలోలు) విభాగంలో జాదవ్ సుశాంత్ బంగారు పతకాలు సాధించారు. రజత పతకాలు సాధించిన వారిలో అండర్-12 కాటా విభాగంలో పాలవర్ సిద్ధేశ్వరి, బలగం అనన్య, అండర్-10 కుమిటే విభాగంలో తౌసీఫ్, అండర్-10 కాటా విభాగంలో జాదవ్ అరుష్, అండర్-14 కుమిటే (-28 కిలోలు) విభాగంలో ఎండీ. అఫ్జల్ ఉద్దీన్ ఉన్నారు. అదేవిధంగా అండర్-12 కాటా విభాగంలో సుభాన్ ఉద్దీన్, అండర్-12 కుమిటే (-34 కిలోలు) విభాగంలో మానెడొల్ల అరుష్, అండర్-8 కుమిటే (-21 కిలోలు) విభాగంలో సమ్యక్ కరాండే, అండర్-10 కాటా విభాగంలో సెట్టెమార్ మేఘన, అండర్-14 కాటా విభాగంలో బిల్కురే రుద్ర కాంస్య పతకాలు సాధించారు.
విద్యార్థుల ప్రతిభపై ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా. వి. నరేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. విజేతలను అభినందిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. విద్యార్థుల విజయంతో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.