బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ముందస్తు సూచనలు

బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ముందస్తు సూచనలు

– 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా సమ్మె 

– 27న బ్యాంకు శాఖలు పనిచేసేలా చర్యలు

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యు ఎఫ్ బి యు) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు శాఖల్లో ప్రత్యక్షంగా అందించే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తుగా తమ బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డి. వీరన్న సూచించారు.

27న ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి

సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నెల 27వ తేదీ ఆదివారం బ్యాంకు శాఖలు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ అనుమతితో బ్యాంకు శాఖలతో పాటు కరెన్సీ చెస్టులు కూడా ఆ రోజు పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు అవసరమైన ఖాతాదారులు వీలైనంత వరకు 27వ తేదీ ఆదివారం రోజునే పూర్తి చేసుకోవాలని సూచించారు.

డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి

సమ్మె సమయంలో శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేని బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంకుల మొబైల్ యాప్‌లు వంటి సేవలతో పాటు ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ వంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమ్మె కారణంగా ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డి. వీరన్న తెలిపారు. ఖాతాదారులు ముందస్తు ప్రణాళికతో తమ బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking