గ్రామ పంచాయతీ కి గ్రామ ప్రజాప్రతినిధుల తీర్మానాలకు గౌరవం లేదా.. ?
– పోలీస్ స్టేషన్ చేరిన బెల్ట్ షాప్ నిర్వహణ వేలం…
చిన్నంబావి, అక్షిత న్యూస్:
చిన్నంబావిలోని బేక్కెం( నేల బిల్క్) గ్రామం లో గ్రామ సర్పంచ్ కమలాబాయి, వార్డు సభ్యులు గ్రామం లో శాంతిభద్రతల నిర్వహణ కొరకు మద్యం అమ్మకాల నిషేధము ను కొనసాగించాలని తీర్మానం చేయడం జరిగినది. గ్రామం లో మద్యపాన విక్రయాల నిషేధం కొనసాగించాలని గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం చేయగా అందుకు వ్యతిరేకం గా రైతు కమిటీ సభ్యులు మద్యం అమ్మకాల కొరకు బెల్ట్ షాపు నిర్వాహన కొరకు బహిరంగ వేలం పాటను నిర్వహించడం తో ఈ వ్యవహారం పోలీస్ స్టేషస్ కు చేరుకున్నది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న స్వగ్రామం సొంత మండలం చిన్నంబావిలోని బేక్కెం( నేల బిల్క్) గ్రామం లో గ్రామ సర్పంచ్ కమలాబాయి, వార్డు సభ్యులు గ్రామం లో శాంతిభద్రతల నిర్వహణ కొరకు మద్యం అమ్మకాల నిషేధము ను కొనసాగించాలని తీర్మానం చేయడం జరిగినది. కాగా అందుకు వ్యతిరేకం గా మద్యపాన సేవన దారులు గ్రామ రైతు కమిటీ ఆధ్వర్యం లో గ్రామం లో మద్యం విక్రయించడానికి బెల్ట్ షాపుల నిర్వహణ కొరకు శనివారం రోజు బహిరంగ వేలం పాటను నిర్వహించి 56 వేల రూపాయలకు గ్రామ నివాసి ఒకరు దక్కించుకున్నారు.కాగా గ్రామం లో మధ్య పాన అమ్మకాలు మద్యపాన నిషేధం కొరకు గ్రామ సర్పంచ్ కమలాబాయి , వార్డు సభ్యులు తీర్మానం చేయగా దానిని గౌరవించ కుండా గ్రామ రైతు కమిటీ సభ్యులు నియమ నిబంధనలకు విరుద్ధము గా అదియును రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వహిస్తున్న మంత్రి సొంత మండలం చిన్నంబావి లోని బె క్కెం గ్రామం లో నిర్వహించడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కి గ్రామ ప్రజాప్రతినిధుల తీర్మానాలకు గౌరవం లేదా.. ? అంటూ గ్రామ సర్పంచ్ , వార్డు సభ్యులు మంగళవారం రోజు చిన్నంబావి మండల పోలీస్ స్టేషన్ కు చేరుకొని చట్టాలకు విరుద్ధం గా అదియును ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లో అక్రమం గా మద్యం విక్రయాలు బెల్టుషాపు నిర్వహణకు బహిరంగ వేలం పాటను నిర్వహించడం ను నిరసిస్తూ చిన్నంబావి మండల పోలీసులకు మంగళవారం రోజు ఫిర్యాదు చేశారు. కాగా మండల పోలీసులు ఎస్ఐ జూరాల ప్రాజెక్టు దగ్గరకు బందోబస్తు కొరకు వెళ్లడం మూలం గా సమస్య పరిష్కారం కాకుండానే అలాగే మిగిలిపోయింది.