బారాన్ని మించిన మానవత్వం
– తండ్రి బాటలో తనయుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట , అక్షిత బ్యూరో :
రాజకీయాలకు అతీతంగా మానవత్వానికి పెద్దపీట వేస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తమ కుటుంబ సంప్రదాయమని మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి నిరూపించుకోగా ఆయన తనయుడు ఏఐసీసీ సభ్యుడు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మరోసారి చాటి చెప్పారు. దామోదర్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో మానవత్వానికి ప్రత్యేక స్థానం కల్పించారు. పరిచయం ఉన్న వ్యక్తి ఏ కులానికి,ఏ మతానికి చెందిన వారైనా మృతి చెందారన్న విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించడం, కుటుంబ సభ్యులను ఓదార్చడం ఆయనకు అలవాటుగా ఉండేది. అంతేకాకుండా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడం ద్వారా మానవత్వానికి రాజకీయాలకు సంబంధం లేదని చాటి చెప్పేవారు.ఈ విషయంలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఆయనను ప్రస్తావించుకోవడం సహజంగా కనిపించేది.తాజాగా ఆయన తనయుడు, ఏఐసీసీ సభ్యుడు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ తండ్రి మానవతా విలువలను కొనసాగించారు.జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే సర్వోత్తమ్‌రెడ్డి నాయకులతో కలిసి ఆయన నివాసానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తర్వాత జరిగిన అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న ఆయన స్వయంగా పాడె మోశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ కూడా పాడె మోశారు. సాధారణంగా బంధువుల్లో కొందరు సైతం పాడె మోయడానికి వెనుకడుగు వేసే సందర్భాలు ఉంటాయి. అలాంటిది ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు స్వయంగా పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొనడం అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులను కదిలించింది.తండ్రి చూపిన మానవతా మార్గాన్ని తనయుడు కూడా కొనసాగిస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తుండటంపై అక్కడ పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు.ఈ సందర్భంగా కొందరు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.