అన్నదానం మహాదానం

అన్నదానం మహాదానం

– రెబల్ గణేష్ విగ్రహం వద్ద తొమ్మిది రోజుల పాటు సాగిన అన్నదానం

– సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపిన వార్డు కౌన్సిలర్ వల్దాస్ లక్ష్మి రెబల్ శ్రీనివాస్ 

సూర్యాపేట , అక్షిత బ్యూరో :

గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో రెబల్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు 23వ వార్డు కౌన్సిలర్ వల్దాస్ లక్ష్మి శ్రీనివాస్ (రెబల్)అన్నారు. వార్డులో ఏర్పాటు చేసిన రెబల్ గణేష్ ఉత్సవ కమిటీ విగ్రహం వద్ద మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి మాట్లాడారు.రెబల్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ లేని విధంగా తొమ్మిది రోజుల పాటు ఈ విగ్రహం వద్ద ప్రతిరోజు చేయడం జరిగిందన్నారు.ఇటీవల విగ్రహం వద్ద తమ ప్రాంత వాసులకు ఇరుముడి సినిమా చూపించడంతో వారంతా కంటతడి పెట్టారని గుర్తు చేశారు.విగ్రహం వద్ద అన్న ప్రసాద వితరణ చేసేందుకు సహకరించిన దాతలకు, భక్తులకు,ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడమర్తి నాగరాజు (డిఆర్), నీరన్,ఉమేష్,పిడమర్తి మహేందర్,పాలడుగు రవి,పాత కొట్టు రాజేష్,బొజ్జ జానీ,ప్రసాద్, సంజీవ్, వల్దాస్ మధు,పిడమర్తి శంకర్,మేడి గోపి,సాయి కృష్ణ, సాయిరాం,అయ్యన్న, పాలడుగు రవి,వల్దాస్ ముఖేష్,గోనె అశోక్, బాలెంల బాబు,మణికంఠ, సుబ్రహ్మణ్యం,సాయి,టోనీ, శ్రావణి,నగరికంటి వీరన్న, వెంకటమ్మ,చరణ్,శివ,యాష్, నాగలక్ష్మి,అఖిల,సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking