ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
– సైబర్ నెల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– తొగుట సిఐ ఎస్.కె లతీఫ్
దుబ్బాక అక్షిత ప్రతినిధి:
రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూరు మండల కేంద్రంలో సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను తొగుట సిఐ లతీఫ్ బుధవారం ప్రారంభించారు. సందర్భంగా సీఐ ఎస్.కె లతీఫ్ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం, ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, నేరాల నివారణలో వాటి పాత్రపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామస్థుల భద్రతకు, సంబంధించిన నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామ పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయపోలే ఎస్సై మానస ,గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు. ఉప సర్పంచ్ హనుమంతు రాజు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.