ఐలయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

ఐలయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

 – ఆర్థిక సహాయం చేసిన మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఓనర్స్ అసోసియేషన్

 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి నీర్నెముల గ్రామానికి చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఐలయ్య కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.22,500 ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కొత్త పరశురాములు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాక రాజు, ప్రధాన కార్యదర్శి కడారి వెంకన్న, ట్రెజరర్ సాగర్ల వెంకన్న, సభ్యులు నాగటి గణేష్, కడారి నాగరాజు, కొత్త ఉపేందర్, ఇర్రి సురేష్, ఆవుల లక్ష్మీనారాయణ, పాక మని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking