తిరంగా ర్యాలీ.. దేశభక్తి నినాదాలతో హన్మకొండ మార్మోగింది

తిరంగా ర్యాలీ.. దేశభక్తి నినాదాలతో హన్మకొండ మార్మోగింది

కాజిపేట్, అక్షిత ప్రతినిధి :

భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్కా కొమ్మురయ్య, జిల్లా, డివిజన్ నాయకులు, యువతతో కలిసి పాల్గొన వరంగల్ 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, పదాధికారులు, వివిధ మండల అధ్యక్షులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, అనుబంధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking