కాజీపేట సోమిడిలో ఎమ్మెల్యే నాయిని పరామర్శ..

కాజీపేట సోమిడిలో ఎమ్మెల్యే నాయిని పరామర్శ..

కాంగ్రెస్ నాయకుడు లింగారెడ్డిని, మాతృవియోగం పొందిన యాదగిరిని పరామర్శించిన ఎమ్మెల్యే నాయిని

కాజిపేట్, అక్షిత ప్రతినిధి :

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గురువారం కాజీపేట 62వ డివిజన్‌లోని సోమిడిలో పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డిని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం సోమిడి గౌడ సంఘం అధ్యక్షులు యాదగిరి తల్లి కౌసల్య ఇటీవల పరమపదించగా, దశదిన కర్మకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తాజా మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్, సుంచు అశోక్, గుంటి కుమార్, 62 వ డివిజన్ అధ్యక్షులు, భద్రకాళి దేవస్థానం ధర్మకర్త పాలడుగుల ఆంజనేయులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking