కాజీపేట వైయస్సార్ గుడిసే వాసులకు కొండంత అండగా కాంగ్రెస్
పేదల వైఎస్సార్ గుడిసెలపై చేయేస్తే ఊరుకునేదే లేదు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజిపేట్, అక్షిత ప్రతినిధి :
హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట మండల వైఎస్సార్ గుడిసెల నిరుపేద ప్రజలు గత 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుండి నేటి వరకు సుదీర్ఘంగా గత 25 సంవత్సరాలుగా చిన్న గుడిసెలలోనే కాలం వెళ్లదీస్తూ బతుకుతుంటే ఇటీవల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు జెసిబిల సాయంతో కబ్జా చేసేందుకు తెగబడుతూ గత 20 రోజులుగా ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనన్న తీవ్ర భయాందోళనల నడుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడిపోతున్న ఆపత్కాలంలో ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేదల ఆక్రోశాన్ని ఆలకించి వైఎస్సార్ గుడిసెల జోలికి ప్రైవేటు వ్యక్తులు వచ్చినా జెసిబిలతో దౌర్జన్యానికి దిగినా సహించేది లేదు అనీ కఠినమైన చర్యలు తప్పవు అనీ హెచ్చరించారు.
మీకు కొండంత అండగా నీడగా నేనున్నాను” అని సంబంధిత అధికారులకు ఖరాకండిగా హుకుం జారీ చేసి పాతికేళ్ల కన్నీళ్లకు చరమగీతం పాడుతూ గుడిసెవాసుల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు భరోసానిచ్చిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా వైఎస్సార్ గుడిసెల నిరుపేదల తరపున కృతజ్ఞతాభినందనలు తెలిపిన జీ డబ్ల్యూ ఎం సి 63వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ విజయ శ్రీ సయ్యద్ రజాలి.