బిజెపి జిల్లా రథసారధి సాయిని మల్లేశంను ఘనంగా సన్మానించిన హుస్నాబాద్ బార్ అసోసియేషన్
కరీంనగర్ అక్షిత బ్యూరో
బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంను మంగళవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్, విశ్వహిందూ పరిషత్ , కరీంనగర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా , పార్టీకి అంకితభావంతో సేవలందించి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా న్యాయవాది సాయిని మల్లేశం నియమితులు కావడం సంతోషకరంగా ఉందని , వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బార్ అసోసియేషన్ సభ్యులు చెప్పారు. బిజెపి జిల్లా రథసారధి సాయిని మల్లేశం ఇన్స్పిరేషన్ నాయకుడని బిజెపి హుస్నాబాద్ నేత పొన్నం శ్రీనివాస్ కొనియాడారు. బిజెపి నాయకులు పొన్నం శ్రీనివాస్ మంగళవారం జిల్లా రథసారథి సాయిని మల్లేశంను ఘనంగా సన్మానించారు.కరీంనగర్ జిల్లా బీజేపీకి కొత్త దిశ , కొత్త నాయకత్వం సాయిని మల్లేశం ఆధ్వర్యంలో దక్కడం హర్షనీయమని , సాయిని మల్లేశం నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, పనిచేసే ప్రతి సామాన్య కార్యకర్తకు సాయిని మల్లేశం ఇన్స్పిరేషన్ నాయకుడు అని పొన్నం శ్రీనివాస్ అన్నారు.